జిడ్డు పూజారా కాస్త మెరుపు పూజారా గా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుజారా తన బ్యాటింగ్‌తో షాకిచ్చాడు. ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ లో కనిపించే పూజారా టి 20 లో కనిపించాడు. టెస్ట్ లో ఆడే ఆటకి భిన్నంగా జిడ్డు పూజారా కాస్త మెరుపు పూజారాగా మారాడు..! సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర జట్లు తలపడ్డాయి.

మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన పుజారా.. తన సహజ శైలికి భిన్నంగా ధాటిగా ఆడాడు.కేవలం 29 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. అర్ధసెంచరీ తర్వాత కూడా దూకుడు కంటిన్యూ చేసిన పుజారా కేవలం 61 బంతుల్లో సెంచరీని బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఈ సెంచరీ ద్వారా సౌరాష్ట్ర తరపున టీ20లలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చతేశ్వర్ పుజారా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 300+, లిస్ట్-ఏ క్రికెట్‌లో 150+, టీ20లలో 100 పరుగులు చేసిన ఆటగాళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ రికార్డుల్లోకి ఎక్కారు. తాజా శతకంతో పుజారా వారి స్థానాన్ని అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఓడిపోయింది.

Share.

Comments are closed.

%d bloggers like this: