70 మంది మరణం..! 50 మందికి గాయాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక్క పేలుడుతో 70 మండి సజీవదహనం అయ్యారు 50 కి పైగా జనం గాయపడ్డారు. ఉక్కిరిబిక్కిరి లో కొంత తొక్కిసలాట జరిగి కొందరు గాయపడ్డారు. ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల ఎగిసిన మంటలు అలా పెద్దగా మారి పెను ప్రమాదానికి దారి తీసి 70 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రసాయన గోదాముల్లో మంటలు చెలరేగి సమీప భవనాలకు వేగంగా వ్యాపించడంతో 70 మంది సజీవ దహనమయ్యారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాత ఢాకాలోని అత్యంత ఇరుకైన చౌక్ బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడి ఓ మసీదు వెనుకన ఉన్న నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రసాయన గోదాములో తొలుత మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

ఆ వెంటనే పక్కనున్న 4 భవనాలకు మంటలు వేగంగా వ్యాపించాయని అన్నారు. ఇందు లో ఒక కమ్యూనిటీ సెంటర్ కూడా ఉందని, అక్కడ వివాహ వేడుక జరుగుతున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 70 మంది మరణించారని ఫైర్ సర్వీసెస్ కంట్రోల్ రూమ్ అధికార ప్రతినిధి కమ్రుల్ అసన్ తెలిపారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఢాకా వైద్య కళాశాల దవాఖాన డైరెక్టర్ నసీరుద్దీన్ పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: