రాష్ట్రం చేరుకున్న కొవింద్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్థాపించిన స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి సతీసమేతంగా నెల్లూరుకు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ఏపిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ… ట్రస్ట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఇలా సమాజ సేవ చేయాలనే భావనను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని రాష్ట్రపతి సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: