విజువ‌ల్ ఎఫెక్ట్స్ దిట్ట‌ కోడి రామకృష్ణ మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చలన చిత్రా సీమ మరో దర్శక దిగ్గజాన్ని కోల్పోయింది. గత కొన్ని రోజుల కిందట దర్శకుడు విజయ బాపినీడు నిన్న గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ నేడు కోడి రామకృష్ణ లని తెలుగు చిత్రసీమ కోల్పోయింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ తో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటూ నేడు ఆయన కన్నుమూశారు.

ఈయన పాలకొల్లులో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు. శ‌తాధిక చిత్రాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న కోడి రామ‌కృష్ణ‌.. 100కు పైగా సినిమాలు తెర‌కెక్కించారు. 1982లో చిరంజీవి ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్‌తయ్య సినిమాతో ఈయ‌న ద‌ర్శ‌కుడిగా మారాడు. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు రామకృష్ణ.

ఇక ఈయ‌న విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకోవ‌డంలో దిట్ట‌. ఇప్పుడంటే రాజ‌మౌళి లాంటి వాళ్లు సంచ‌ల‌నాలు చేస్తున్నారు కానీ.. పాతికేళ్ల కిందే ఈయ‌న అలాంటి అద్భుతాలు చేసాడు. 1984లో వ‌చ్చిన మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు సినిమాతో చ‌రిత్ర సృష్టించాడు కోడి రామ‌కృష్ణ‌.
ఆ త‌ర్వాత ముద్దుల కృష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య‌, ముద్దుల మేన‌ల్లుడు, అంకుశం, ఆహుతి, అమ్మోరు, దేవీ, శ‌త్రువు, పెళ్లి, పెళ్లి పందిరి, పెళ్లి కానుక‌, అంజి, దేవీ పుత్రుడు, అరుంధ‌తి లాంటి ఎన్నో సంచ‌ల‌న సినిమాలు తెర‌కెక్కించాడు కోడి. ఈయ‌న మ‌ర‌ణం తెలుగు ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు అంటూ అంతా సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: