చికెన్ ముక్క కోసం హత్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా వింతైన విషయాలకి చిన్న చిన్న రిసన్స్ కి కూడా హత్యలు జరుగుతున్నాయి. చిన్న విషయాలకి గొడవై అవి కాస్త పెద్దవై కోపాన్ని అదుపులో పెట్టుకోలేక హత్యలు చేసేస్తున్నారు. డబ్బు కోసమూ పరువు కోసమో చేసిన హత్యల గురించి విన్నాం కానీ ఈ మద్య ఒక చికెన్ ముక్క గురించి కూడా హత్యలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోకండి. చెన్నై లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే చెన్నైలోని కోయంబేడు‌లో ఓ పెద్ద పూల మార్కెట్ ఉంది… ఈ క్రమంలో యువతి, యువకుడు పూలు కొనడానికి వచ్చారు. ఆకలిగా ఉండటంతో అక్కడికి దగ్గరలోని ఓ హోటల్ లో బిర్యానీ కొని తింటున్నారు. అయితే తాను తింటున్న బిర్యానీలో ఒక్క చికెన్ ముక్క కూడా రాలేదని అమ్మాయి.. అబ్బాయిని అడిగింది. ఈ విషయంలో మాటామాటా పెరిగి వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కోపంతో ఊగిపోతున్న అబ్బాయి తన దగ్గర ఉన్న కత్తి తీసి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే మరణించింది. ఆమె అరుపులు విన్న వ్యాపారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని గమనించిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: