బాలయ్యకి కోర్టు నోటీసులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పుడూ ఒక పక్క సినిమాలు మరోపక్క వివాదాల గుప్పిట్లో ఉంటారు నటుడు బాలకృష్ణ. నోరుజారడం చేయిజారాచడం ఈయనకి అలవాటు. ఈ నేపధ్యంలో నంద్యాల ఉప-ఎన్నిక సందర్భంగా టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ అప్పట్లో ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యం జస్టిస్ ఏవీ రావు, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బాలకృష్ణకు నోటీసులు జారీచేసిన హైకోర్టు, పిటిషనర్‌ నోటీసును అందజేసేందుకు కూడా అవకాశం కల్పించింది.. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని వైసీపీ ఆరోపించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ కె.శివకుమార్‌ ఆగస్టు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాటి విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యంపై బాలకృష్ణ వాదనలు తెలుసుకోవడం తప్పనిసరని భావించిన ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీచేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: