క్లారిటీ ఇచ్చిన సబ్బం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు మొదలయ్యింది. నేతలిద్దరూ మకోటేయండి అంటే లేదు మకోటేయండి అనట్టుగా ప్రచారాలు చేస్తున్నారు. సభలతో ఎన్నికల జోరు పెంచుతున్నారు. మరోపక్క పవన్ కల్యాణ్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ తన ఎత్తులు తాను వేస్తున్నారు. ఎన్నికల జోరు మాదిరిగానే నేతల పార్టీల మారడం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తి గా మారింది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీని విడుటారో ఏ పార్టీ లో చేరతారో తెలియని పరిస్తితి.

అయితే ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తున్న సబ్బం హరి ఏ పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో వైఎస్ జగన్ ను పొగిడిన సబ్బం హరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం దగ్గర్లో ఉండటంతో ఆయన ఇక తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించారు. తనకు రెండే ఆప్షన్లు ఉన్నాయని వెళ్తే టీడీపీలోకి వెళ్లడం లేదా రాజకీయాల నుంచి తప్పుకోవడమేనన్నారు. ఆయన ఇంకా మట్లాడుతూ.. పోలవరం గురించి జీవీఎల్ నరసింహరావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి వచ్చే..ఆదాయం, రాష్ట్రాలు ఇస్తేనే వచ్చిందన్నారు. అంతేగాని.. ప్రధాని మోదీ తన తాతలు సంపాదించిన ఆస్తిని ఏమైనా ఇస్తున్నారా..అని అన్నారు. రైతులు రాజధాని కోసం.. 35వేల ఎకరాలు ఇస్తే..కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. ఒక్క ఎకరా ఇవ్వమని చెప్పిన ఉద్ధండపురం రైతులు కూడా.. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి ముందుకు వచ్చి భూమి ఇస్తాంమంటున్నారు అని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: