ఎట్టకేలకు నోరు విప్పిన కోహ్లీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ లో తీవ్రవాద దాడి జరిగి కొన్ని రోజులు అయినప్పటికి ఆ దాడి జ్వాల ఇంకా చల్లారలేదు. 44 మంది జవాన్లు అమరులు కావడంతో భారత్ స్తంభించిపోయింది. ఈ దాడికి ప్రతీ ఒక్కరూ తమ వంతు నిరసనలు తెలుపుతున్నారు. రాజకీయ నేతలు సినీ తారలు యువత మరియు క్రీడాకారాలు వార్వారి నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్లు గంభీర్, హర్బజన్, గంగూలీ ఈ దాడికి నిరసన తెలియజేయాలంటూ జూన్ 16న జరగనున్న భారత పాక్ ఆటను భారత్ నిషేదించాలంటు భారత జట్టుకి బి‌సి‌సి‌ఐ కి విజ్ఞప్తి చేశారు..

ఇది ఇలా ఉండగా విశాఖ పట్నంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సీరీస్ ప్రారంభకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే టీంఇండియా ఆటగాళ్లంతా వైజాగ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20, వన్డే సీరిస్ ల గురించి మాట్లాడారు. అనంతరం పుల్వామా దాడి, ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ గురించి కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో మ్యాచ్ ఆడకూడదంటూ వస్తున్న డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం, బిసిసిఐ నిర్ణయం తీసుకుంటాయని కోహ్లీ తెలిపాడు. వారి ఆదేశాలను తాము శిరసావహిస్తామని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారత జట్టు మొత్తం కట్టుబడి వుంటుందని కోహ్లీ వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: