పాక్ ని చిత్తుగా ఓడించండి..సచిన్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ కప్ టోర్నీ చరిత్ర తీసుకుంటే పాక్ పై ప్రతిసారి భారత జట్టే పైచేయి సాధించింది. ఈ ప్రపంచ కప్ లో కూడా చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలా పాక్‌ను చిత్తుగా ఓడించే అవకాశాన్ని భారత్ వదులుకోవద్దని సచిన్ సూచించారు. పాక్ పై భారత మాజీ ఆటగాళ్లు నిరసనలు తెలియజేయాలంటూ ప్రపంచ కప్ ఆటల్లో భాగంగా జూన్ 16న జరగనున్న భారత పాక్ ఆటాను భారత జట్టు బహిష్కరించాలని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే అలా చేయటం వల్ల మనమే పాక్ ను ఇంకొంచం ప్రమోట్ చేసిన వాళ్లమీ అవుతామనై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు.

ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్ శతృదేశమైన పాకిస్థాన్ కు సహాయం చేయాలని తాను కోరుకోవడంలేదని టీమిండియా లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ జట్టుతో టీంఇండియా తలపడకుండా బహిష్కరిస్తే రెండు పాయింట్లు పాక్ ఖాతాలో చేరతాయి. దీంతో పాక్ కు లబ్థి చేకూరుతుందని…కాబట్టి భారత్ అలా చేయకుంటేనే బావుంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. అయితే భారత్-పాక్ మ్యాచ్ విషయంలో భారత ప్రభుత్వం, బిసిసిఐ నిర్ణయమే ఫైనల్ అని సచిన్ అన్నారు. ఆ నిర్ణయం ఏదైనా తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: