కంట్లో 500 ల కన్నాలట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇది వరకు ఫోన్ అంటే ఎవరితో అయిన మాట్లాడటానికో సమాచారాన్ని తెలియజేయటానికి వాడేవారు. ఇపూడూ ఫోన్ తోనే అన్నీ పనులు చేసేస్తున్నారు. సంచారం తెలియజేయటానికి వాడే ఫోన్ నిత్యవసర వస్తువుగా రూపు దిద్దుకుంది. ఫోన్ లేకపోతే రోజులో ఒక్క గంట కూడా గడపలేని పరిస్థితి..! చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరూ ఫోన్ వాడుతున్న కాలం ఇది. అయితే ఫోన్ వాడటం తప్పు కాదు అదే పనిగా ఫోన్ ఒక్కటే వాడటం తప్పు కొన్ని సంధార్భాల్లో ఆ తప్పే ప్రమాదాలకి దారి తీస్తుంది.

తాజాగా ఈ నేపథ్యంలోనే తైవాన్‌కి చెందిన ఓ యువతి ఇబ్బందుల పాలైంది. అధిక బ్రైట్‌నెస్‌తో అదే పనిగా వాడటం వల్ల దాదాపుగా ఆ యువతి కంటికి 500 కి పైగా రంద్రాలు పడ్డాయని డాక్టర్లు వెల్లడించారు. తైవాన్‌లో నివసిస్తున్న చెన్ అనే యువతి గత రెండు సంవత్సరాలుగా ఫుల్ బ్రైట్‌నెస్‌తో ఫోన్ వాడేది. అయితే, కొన్ని నెలలుగా ఆమె కళ్లు నొప్పిగా అనిపించడం మొదలైంది. దీంతో పాటు కంటిలో నుంచి నీరు కారేది. అయినప్పటికీ.. ఫోన్ వాడకం తగ్గించలేదు. సమస్య తీవ్రమయ్యేసరికి డాక్టర్‌ని సంప్రదించింది.

సాధారణంగా ఫుల్ బ్రైట్ నెస్‌తో రోజులో ఎక్కువసేపు ఆపకుండా మొబైల్ చూస్తేనే సమస్యలొస్తాయి. వృత్తీ రిత్యా ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్రటరీగా చేస్తున్న చెన్ ఆఫీస్ పనుల కోసం 2 సంవత్సరాలుగా ఎక్కువ బ్రెట్‌నెస్‌తో ఫోన్ వినియోగించేది.. అందుకే తనకీ సమస్య వచ్చింది. కాబట్టి.. ఫోన్ రెగ్యులర్‌గా వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: