గంజాయి అంబులెన్స్ గా మారిన రోగుల అంబులెన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గంజాయిని సేవించడమే తప్పు అంటే ఏకంగా 1813 కిలోల గంజాయి తరలించడం ఇంకెంత తప్పు..? అది కూడా ఒక అంబులెన్సు లో.. రోగులని తిప్పాల్సిన అంబులెన్స్ లో గంజాయిని తిప్పుతున్నారు. ఎవ్వరూ ఊహించని ఋతులో ఈ చర్య కి పాల్పడ్డారు స్మగ్లర్లు.. అవును ఈ ఘటన విశాఖపట్నం లో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో అధికారులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. అంబులెన్సు ముసుగులో భారీఎత్తున తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సబ్బవరం మండలం సమీపంలో ఈరోజు చోటుచేసుకుంది. ఇక్కడి నాతయ్యపాలెం గ్రామం వద్ద ఓ అంబులెన్సులో గంజాయిని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు, పోలీసుల సాయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అంబులెన్సు రావడాన్ని గమనించి దాంట్లో సోదాలు నిర్వహించగా 1,813 కేజీల గంజాయి ఆ వాహనం నుంచి బయటపడింది. దీని విలువ మార్కెట్ లో రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: