ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా.. నామినేషన్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడానికి పలువురు నేతలు వారి మద్దత్తు దారులతో హాజరయ్యారు. ఇందులో భాగంగా హోం మంత్రి మహమూద్ అలీ, ఎగ్గె మల్లేషం కురుమ. శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా నామినేషన్ దాఖలు చేసారు. నలుగురు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నర్శింహాచార్యులుకు అందజేసారు.

శేరి సుబాష్ రెడ్డి గారితో హారాష్ రావు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్ హాజరు అయ్యారు. సత్యవతి రాథోడ్ తో ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య, వినయ భాస్కర్ లు హాజరు అయ్యారు. యెగ్గె మల్లేషంతో కేటీఆర్, మల్లారెడ్డి, కాలేయాదయ్య, వివేకానంద హాజరయ్యారు . హోం మంత్రి మహమూద్ అలీ తో తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్ , దానం నాగేందర్ , మాగంటి గోపినాథ్ హాజరయ్యారు.. ఎం ఐఎం నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా నామినేషన్ దాఖలు చేసినా మిర్జా రియాజ్ ఉల్ హసన్ తో అహ్మద్ బలాల, జాఫర్ హుస్సేన్ లు హాజరయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: