కర్నూల్ లో పవన్ కి మాజీ భార్య ఢీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మరో పక్క పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ రిపోర్టర్ అవతారం లో కవరేజ్ చేస్తుంది. ఆమె సాక్షి లోగోతో యాంకరింగ్ చేస్తుంది. ఇదే ఇప్పుడు కర్నూల్ జిల్లా లో హాట్ టాపిక్.. తాజాగా రేణు దేశాయ్ సాక్షి టీవీ లో యాంకర్ గా తన రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తా బాగా ప్రచారం అవుతుంది. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని డైవర్ట్ చేయడానికి ఇది జగన్ పన్నిన కుట్రనా.. అనే ప్రశ్న అటు కర్నూల్ జిల్లా లోనూ మరియు జనసైనికుల లోనూ మొదలయ్యింది.

ఇప్పటికే పవన్ కర్నూలు జిల్లా ఆదోనిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇకపోతే రైతాంగ సమస్యలపై అధ్యయనం కోసం సినీనటి రేణుదేశాయ్‌ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి మంత్రాలయం చేరుకున్న రేణు దేశాయ్ ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఒక్కసారిగా ఆమె సాక్షి లోగోతో ప్రత్యక్షమవ్వడంతో అంతా గుసగుసలాడుకుంటున్నారు. రేణు దేశాయ్ రైతులకు సంబంధించి ఒక సినిమా తెరకెక్కిస్తున్నారని అందులో భాగంగా ఆమె స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారని ప్రచారం.
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ కు ధీటుగా రేణు దేశాయ్ ను రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ నిర్వహించబోయే కార్యక్రమాలను సాక్షి టీవీ లైవ్ కవరేజ్ మాత్రమే ఇస్తుందని రేణు దేశాయ్ సిబ్బంది చెప్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: