పీరియడ్ కి ఆస్కార్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ కి అవార్డు దక్కింది. ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయినప్పటికీ.. అవార్డుల రాక చాలా సార్లు నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సినిమాకి ఆస్కార్ రావడం ప్రతిష్టాత్మకం.

ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఈ చిత్రానికి రేకా జెహ్ తాబ్చి దర్శకత్వం వహించారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ సినిమాలో చూపించారు. 25 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సహాయపడ్డారో అనేదే ఈ సినిమా.

Share.

Comments are closed.

%d bloggers like this: