హైవే పై కాలిపోయిన మహిళా శవం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంతకాలంగా దేశం లో కానీ రాష్ట్రం లో కానీ ఎటు చూసీనా అత్యాచారాలు హత్యలు.. ఇవే వినిపిస్తున్నాయి. చట్టం లో మార్పులు చేసినప్పటికీ కొందరు చట్టాన్ని అతిక్రమిస్తునే ఉన్నారు. మహిళల పై హత్యలని అరికట్టేందుకు ఇంకేం చర్యలు తీసుకోవాలో తెలియని పరిస్థితి.. తాజాగా తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా హైవే లో ఊ గుర్తు తెలియని మహిళా శవం కనిపించింది. ఆ మృతుదేహం పరిస్థితి అంతు చిక్కని రీతి లో ఉంది. ఎవరో ఆ శవాన్ని అక్కడ కాల్చి పారేశారు.

వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ ను అతికిరాతకంగా కాల్చి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరరం పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గజ్వెల్ ఏసీపీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ – సిద్దిపేట రాజీవ్ రహదారి వర్గల్ మండలం సింగాయపల్లి స్టేజ్ దగ్గర రాజీవ్ రహదారి కల్వర్టు కింద ఓ మృత దేహం లభించిందని , సుమారు 25 సంవత్సరాలు గల మహిళను ఎక్కడో దుండగులు చంపి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చినట్టుగా గుర్తించామని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వెల్ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని , ఈ కిరతకానికి పాల్పడిన దుండగులను పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేస్తామని ఏసీపీ నారాయణ అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: