టీడీపీ సీటు పై.. కౌశల్ కన్ను..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీసన్ 2 ని మరిచిపోయారేమో కానీ షో విన్నర్ కౌశల్ ని మాత్రం ఇంకా అభిమానులు గుర్తు పెట్టుకున్నారు. ఈయనకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు ఈయనకి ఎవరైనా వ్యతిరేకం అంటే చాలు అభిమానులు.. ఫెస్బుక్ పేజీలు.. వారినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. ఈ ప్రేక్షకాదరణ ని క్యాషిన్ చేసుకున్నాడు కౌశల్. తన అభిమానులు కులం అన్నీ సహకరించడంతో ఆంధ్రప్రదేశ్ రానున్న ఎన్నికలపై కౌశల్ కన్నెసాడట.

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ ఇప్పుడు రాజకీయాల మీద కన్నేశాడు! అటు బిగ్ బాస్, ఇటు కులం కోటాలో ఈయన ఎన్నికల్లో పోటీచేయాలని అనుకున్నాడట. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడట!
అనకాపల్లి నుంచి ఈయన ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడట. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలే ధ్రువీకరిస్తూ ఉన్నాయి. వివిధ సమీకరణాల నేపథ్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ను కాపు సామాజికవర్గానికి కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. అందుకోసం పలువురు నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారట. ‘బిగ్ బాస్’ గుర్తింపుతో కౌశల్ కు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రాధాన్యతను ఇస్తుందా? ఎమ్మెల్యే టికెట్ నే కేటాయించేస్తుందా? అనేవి ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలే!

Share.

Comments are closed.

%d bloggers like this: