అందరి చూపు.. ఆ ముగ్గురి వైపే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ వేదిక పై బాలయ్య, కళ్యాణ్ రామ్ జూ.ఎన్‌టి‌ఆర్ ముగ్గురూ.. ఒకర్ని మించి ఒకరు ప్రసంగించారు. వీరు ముగ్గురు మాటాడటం చూసి అభిమానుల అంచనాలు ఆకాశానికి చేరాయి. అయితే ఎన్‌టి‌ఆర్ బయోపిక్ భారీ ఫ్లాప్ ల తరువాత మళ్ళీ వీరు ముగ్గురూ ఒకే వేదిక పై కనిపించనున్నారు.

118 సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం మరోసారి బాలయ్య, తారక్, కల్యాణ్ రామ్ కలవబోతున్నారు. రెండు భారీ డిజాస్టర్ల తర్వాత ఒకే వేదికపైకి రాబోతున్న వీళ్లు ముగ్గురు బయోపిక్ గురించి ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.నిజానికి ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన తీసుకురాకుండా చేయాలనేది వీళ్ల ముగ్గురి ఆలోచనగా ఉంది. బయోపిక్ తో డీలా పడిన ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకు ఈ ముగ్గురూ ఇలా కావాలని కలుస్తున్నారట.

అయితే బాలయ్య మైక్ అందుకుంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ముగిస్తాడనేది ఎవరికీ తెలీదు. నిజానికి అతడికి కూడా తెలీదు. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన కచ్చితంగా వచ్చితీరుతుందని చాలామంది వెయిటింగ్. బయోపిక్ తో ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి అతడు ఈ సినిమా గురించి మాట్లాడకపోవచ్చు. కల్యాణ్ రామ్, బాలయ్య మాత్రం బయోపిక్ డిజాస్టర్ పై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: