టీడీపీ వైసీపీ ల మధ్య ఘర్షణ.. బగ్గుమన్న ఒంగోలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు ఎండు గడ్డి పై నిప్పు రవ్వ మాదిరిగా తయారయ్యింది. బావోద్వేగాలు ఘర్షణ లతో రాజకీయ వేడి పుంజుకుంటుంది. అధినేతలు మాటల దాడులు చేసుకుంటుంటే కార్యకర్తలు మాత్రం వ్యక్తిగతమైన దాడులకి పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గాల మద్య ఘర్షణ మొదలై అది కాస్త గందరగోళానికి దారి తీసింది. ఇరు వర్గాల వారు తోపులాటలు చొప్పులు విసురుకున్న దృశ్యాలు చోటు చేసుకున్నాయి.

ప్రకాశంజిల్లా ఒంగోలులో టీడీపీ వైసీపీ వర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారితో పాటు పలువురు పోలీసులకు కూడా స్వల్ప గాయాలవ్వడం గమనార్హం. ఒంగోలు 8వ డివిజన్ కమ్మపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్నీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రారంభించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే కమ్మపాలెం ఎంట్రన్స్ లోనే టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. బాలినేని ను రానిచ్చేది లేదంటు వారు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ వైసీపీ నాయకులమద్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరకొట్టారు.

మరోవైపు బాలినేనిను పోలీసులు కోర్ట్ సెంటర్లో నిలివేశారు. పోలీసుల తీరుపై బాలినేని తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం కమ్మపాలెం ఎంట్రన్స్ వద్దకు చేరుకున్న బాలినేని కార్యాలయం ప్రారంభించకుండా కదిలేది లేదని అక్కడే కారులో కుర్చున్నారు. మరోవైపు కార్యాలయం ప్రారంభానికి టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని వైసీపీ కి చెందిన ఒక యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇది గమనించిన పోలీసులు అతన్నీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇరువర్గాల మద్య సంధి కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పోలీసులు ఆందోళనకు పాల్పడిన 10 మంది టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేత బాలినేని కూడా అరెస్ట్ చేశారు. బాలినేనితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: