ముందు బెట్టింగ్లు ఆ పై కెమెరాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కంటోన్మెంట్ లో ఓ ఉన్నత కుటుంబంలో పుట్టి, ఉన్నత విధ్య చదువుతున్న బిటెక్ విధ్యార్థి జలసాలకు, క్రికెట్ బెట్టింగులకు బానిసై అడ్డుదారులలో డబ్బులు సంపాదించాలని పోలీసులకు అడ్డంగా దొరికి జైలు పాలైనాడు. బోయిన్ పల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ డి.రాజేష్ ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఉన్నత కుటుంబంలో జన్మించిన హైదరాబాద్ అంబర్ పేట నివాసి టి. రంజీత్ కుమార్ రెడ్డి (24),బిటెక్ రెండవ సంవత్సరం చదువుతుండగానె ఉద్యోగం కోసం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అతని అన్న వద్దకు వెల్లాడు.

అమెరికాలో ఉద్యోగం దొరుకకా తిరిగి హైదరాబాద్ కు వచ్చేసి ఏవిదంగానైన డబ్బులు సంపాదించాలనె ఉద్దేషంతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతూ, జలసాలకు అలవాటు పడి మోసాలు చేయనారంభించాడని సిఐ రాజేష్ వివరించారు. వోఎల్ ఎక్స్ ఆన్ లైనలో విలువైన కెమరాలు అద్దెకు తీసుకొని,కొంతకాలం అద్దెచెల్లించి తర్వాత ఆ కెమరాలను విక్రయించేవాడని దాంతో డబ్బలుసంపాదించి జలసాలకు బానిసైనాడన్నారు. అలాగే బెట్ 365 ఆన్ లైనులో క్రికెట్ బెట్టింగులు ఆడుతున్నాడని సిఐ చెప్పారు.

ఇది ఇలాఉండగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అన్న వద్దనుంచి విలువైన ఐఫోన్లు తెప్పించుకోని అమ్ముకొని రంజిత్ కుమార్ రెడ్డి జలసాలు చేసేవాడని ఆయన తెలిపారు. ఇతని తండ్రి దుబాయ్ లో ఉద్యోగం చేస్తండగా అతని వద్దనుంచి కూడా ఏదోవిధంగా డబ్బులు వసూలు చేసేవాడని పేర్కొన్నారు. పాతబోయిన్ పల్లి ,మల్లికార్జున కాలనీకి చెందిన కొయ్యాడ మణికంట అనె బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు ప్రారంభిచారు. ఎస్ ఐ సుధాకర్ రెడ్డి,సిఐ రాజేష్ లు చాకచక్యంగా వలపన్ని కోటిలోని హరిదాస్ మార్కెట్ లో విలువైన కెమరాలు విక్రయిస్తుండగా రెడ్ హాండెడ్ గా పట్టు కోవడం జరిగింది. అలాగె రంజిత్ కుమార్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా తొమ్మిది విలువైన కానన్ కెమరాలు స్వాధీనం చేసుకున్నామని దీని విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుందని సిఐ రాజేష్ చెప్పారు. ఐపిసి 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నామని రాజెష్ అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: