మటన్ తెచ్చిన రచ్చ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బంధు మిత్రులతో సందడి చేయాల్సిన పెండ్లి ఇల్లు కొట్లాటకి అడ్డాగా మారింది. అందరూ కలిసి విందు భోజనమ్ చేయాల్సింది పోయి ఒకరి పై ఒకరు దాడికి దిగారు. ఆ దృశ్యాలు చూస్తే ఏవో ఆస్తి తగాదాలు అనుకుంటారు కానీ తీర చూస్తే అదంతా కేవలం ఒక మటన్ ముక్క కోసం అని తరువాత తెలిసింది. ఒక్క మటన్ ముక్క కోసం చేతులతోనే కాకుండా కుర్చీలతో కర్రలతో టెంట్ సామగ్రి తో కొట్టుకున్న దృశ్యం. సంభరం కాస్త గందరగోళం గా మారింది.

వివరాల్లోకి వెళితే.. విందులో మటన్ లేదంటూ వరుడి బంధువులు అలక కొట్లాటకు దారితీసింది. కుర్చీలు, కర్రలతో రెండు వర్గాలుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా బయటపడింది.

బూర్గంపాడు మండలం ఉప్పుసాకకు చెందిన యువతిని కొత్తగూడెనికి చెందిన యువకుడికి ఇచ్చి మూడు రోజుల క్రితం వివాహం చేశారు. వివాహం ఉప్పుసాకలోని వధువు ఇంట్లో జరిగింది. కాని విందులో మటన్‌ పెట్టలేదని పెళ్లికొడుకు బంధువులు గొడవకు దిగారు. తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని.. అందుకే చికెన్‌ పెడుతున్నామని పెళ్లికూతురు బంధువులు సర్థిచెప్పారు.
పెళ్లికొడుకు తరపు బంధువులు మాత్రం బెట్టు వీడలేదు. దీంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. కోపంతో ఒకరిపై మరొకరు కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఎనిమిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన బయటపడింది.

Share.

Comments are closed.

%d bloggers like this: