పాక్ కు ట్రంప్ హెచ్చరిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మంగళవారం ఉదయం 3.30 గతల ప్రాంతలో భారత ఎయిర్ ఫోర్స్ పది యుద్ధ విమానాలతో పాక్ భూభాగంలోకి చొరబబడి కాల్పులు జరిపింది బాల్కోట్ లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలే టార్గెట్ గా బాంబులు విసిరింది. ఈ దాడిలో దాదాపుగా 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు ఆర్మీ వెల్లడిస్తుంది. అయితే దీని పై మన దేశం లోని నాయకులే కాకుండా అమెరికా వంటి అగ్ర దేశ ప్రధానులు సైతం మాట్లాడుతున్నారు పాక్ ను భారత్ తో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న జరిగిన సర్గికల్ స్ట్రైక్ పై నోరు విప్పారు పాక్ ని హెచ్చరించారు.

ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ… పుల్వామా ఆత్మాహుతి దాడిని భయంకర పరిస్థితిగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆత్మరక్షణ చర్యలను చేపట్టే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. తాజాగా, పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ దాడులను ట్రంప్ పరోక్షంగా సమర్ధించారు. అంతేకాదు, తమ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ వెంటనే నాశనం చేయాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏ ఒక్క ఉగ్రవాదికి మద్దతు పలికినా, అది దేశానికే నష్టం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ… భారత్‌ను కవ్వించే చర్యలు పాక్ మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదంపై తీరును మార్చుకోవాలని ఎంతో కాలంగా పాక్‌ను తాము పదే పదే కోరుతూనే ఉన్నామని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు కూడా అదే మాట చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ఒకవేళ యుద్ధమే సంభవిస్తే అత్యధికంగా నష్టపోయేది పాకిస్థానేనని వార్నింగ్ ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: