రెండేకరాలలో జగన్ కొత్త ఇల్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లు హాజరు కాగా.. వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు. అంతకు ముందు జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. జగన్ గృహప్రవేశంలో కేసీఆర్ పాల్గొంటారని ప్రచారం కూడా జరిగింది.

సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో రూపుదిద్దుకున్నాయి. విభజన అనంతరం సీఎం చంద్రబాబు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకోగా, జనసేన అధినేత పవన్ సైతం ఇల్లు, కార్యాలయం ఒకేచోట నిర్మించుకున్నారు. తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కూడా తన నివాసాన్ని రాజధాని పరిధిలో ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇక నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ అమరావతి కేంద్రంగా నిర్వహించనున్నారు.వాస్తవానికి ఫిబ్రవరి 14నే ఈ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సిన పరిస్తితి వచ్చింది. అయితే తిరిగి రెండు రోజుల కిందట ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసి, ఫిబ్రవరి 27గా నిర్ణయించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: