ఎట్టకేలకు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల లిస్టు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం గాంధీభవన్‌లో సమీక్ష జరిగింది. ఎట్టకేలకు తీవ్ర వాగ్వాదాల తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు ఇచ్చిన లోక్‌సభ అభ్యర్థుల పేర్లపై ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.
ఈ జాబితాతో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిల్లీ వెళ్లి ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి జాబితా అందచేస్తారు. పరిశీలన అనంతరం ఏఐసీసీ అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా, ఉత్తమ్‌, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థుల జాబితా..!

1. ఆదిలాబాద్‌: సోయంబాపూరావు, నరేష్‌ జాదవ్‌, రమేష్‌ రాథోడ్‌
2. పెద్దపల్లి: కవ్వంపల్లి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్‌, జి.శ్రీనివాస్‌
3. నిజామాబాద్‌: మధుయాస్కీ, పి.సుదర్శన్‌రెడ్డి, మహేష్‌గౌడ్‌
4. నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పద్మావతిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి
5. భువనగిరి: మధుయాస్కీ, వంగాల స్వామిగౌడ్‌, రాపోలు జయప్రకాశ్‌, గూడూరు నారాయణరెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి
6. మెదక్‌: నిర్మలా జగ్గారెడ్డి, అనిల్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌
7. ఖమ్మం: రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వి.హన్మంతరావు, సంభాని చంద్రశేఖర్‌, గాయత్రి రవి
8. కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌, మృత్యుంజయం, ప్యాట రమేష్‌, నేరెళ్ల శారద
9. నాగర్‌కర్నూల్‌: నంది ఎల్లయ్య (సిట్టింగ్‌ ఎంపీ), మల్లురవి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌, బొల్లు కిషన్‌, సతీష్‌ మాదిగ
10. మల్కాజిగిరి: కూన శ్రీశైలంగౌడ్‌, కనుకుల జనార్దన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి
11. చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(సిట్టింగ్‌ ఎంపీ), కార్తీక్‌రెడ్డి, భిక్షపతియాదవ్‌
12. మహబూబ్‌నగర్‌: వంశీచందర్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి
13. జహీరాబాద్‌: మదన్‌మోహన్‌రావు, సుభాష్‌రెడ్డి, జూపాల్‌రెడ్డి(బాగారెడ్డితనయుడు)
14. సికింద్రాబాద్‌: ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, మరో ఇద్దరు
15. వరంగల్‌: సిరిసిల్ల రాజయ్య, మందకృష్ణమాదిగ, మానవతారాయ్‌
16. మహబూబాబాద్‌: పి.బలరాంనాయక్‌, రవీంద్రనాయక్‌, బెల్లయ్యనాయక్‌, చీమల వెంకటేశ్వర్లు
17. హైదరాబాద్‌: అజారుద్దీన్‌, మరో ఇద్దరు

Share.

Comments are closed.

%d bloggers like this: