వైసీపీ లోకి దగ్గుబాటి కుమారుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రలో ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి ఈ తరహాలో ఆ పార్టీ వారు ఈ పార్టీలోకి ఈ పార్టీ వారు ఆ పార్టీ లోకి చేరుతున్నారు. ఈ నేపద్యం లో దగ్గుబాటి దంపతులు వెంకటేశ్వరరావు- పురందేశ్వరి కుమారుడు హితేష్ చెంచురామ్ ఈరోజు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్, హితేష్ కు తమ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా లాంఛనంగా వైసీపీలో చేరారు. ఇదిలా ఉండగా, రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున హితేష్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

వై‌సీపీ లో చేరిన అనంతరం హితేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌తో కలిసి పని చేయడానికి చాలా ఆనందంగా ఉంద అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ ఎనలేని పోరాటం చేస్తున్నారని హితేశ్‌ పేర్కొన్నారు. పాదయాత్రలో ఆయన పడిన కష్టం, ప్రజలకు మేలు చేసేందుకు పడుతున్న తపన చూస్తే… వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరికీ మేలు జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు. అమ్మానాన్నలు ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబంపై ఒక్క మచ్చ కూడా లేదని హితేశ్‌ తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: