బాబు ఫోన్ కాల్..! త్వరలో ఉగ్ర టీడీపీ లోకి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కనిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఇటీవలే తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంత కాలం ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆయన నియోజకవర్గం అభివృద్ది చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయానాకి ఫోన్ చేశారని సమాచారం.

తాజాగా ఐవి ‌ఆర్‌ఎస్ సర్వే నిమిత్తం ఆయనపై ప్రజల్లో మంచి నమ్మకం గ్రహించిన చంద్రబాబు ఆయన పై స్పెషల్ గా స్టడీ చేసి ఆయనకి బాబు ఫోన్ చేయడం గమనార్హం. గత అయిదేళ్లుగా ఆయన చేసిన అభివృద్ది కార్యక్రమాలు చేశారు, ఆయన ఉగ్ర సిఫార్సులను అనుసరించి ఎంతో మందికి సీఎం సహాయనిధి నుంచి డబ్బులిచ్చారు. ఆరు నెలల క్రితం వరకూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, అదే పార్టీలో కొనసాగితే, రాజకీయ భవిష్యత్తు కష్టమవుతుందన్న ఆలోచనతో, పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

అయితే ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గం లో టీడీపీ పార్టీనే అధికారంలో ఉంది. కనిగిరి ఎమ్మెల్యేగా కదిరి బాబూరావు కొనసాగుతుండగా, ఉగ్రనరసింహారెడ్డిని కూడా చేర్చుకుంటే తిరుగుండదని, ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మరొకరిని ఎమ్మెల్సీని చేయవచ్చని భావించిన చంద్రబాబు, ఉగ్రను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉగ్ర నర్సింహారెడ్డీ తన కార్యకర్తలతో అనుచరులతో చర్చలు చేస్తున్నట్టుగా సంచారం త్వరలో ఆయన అనుచరులతో చంద్రబాబు సమక్షం లో పార్టీ తీర్తం పుచ్చుకోబోతున్నారట..!

Share.

Comments are closed.

%d bloggers like this: