టీడీపీ ని వదలని వలసలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. కేర్ ఆఫ్ వలసలు అన్నట్టుగా మారాయి. ఒక పక్క ఎన్నికల వేడి పెరుగుతుంటే మరోపక్క వలసల ప్రవాహం కూడా అదే రీతిలో పెరుగుతుంది. టీడీపీ నుండి నేతలు కార్యకర్తలు వై‌సీపీ కి వలసలు కడుతున్నారు. ఎన్నికల డేట్ దేగ్గర పడుతుండటం తో రోజురోజుకి వలసల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే ఎందరూ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు సొంత ఇలాక చిత్తురూ లో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు అక్కడి నేతలు. చంద్రబాబు సొంత నియోజకవర్గం లో ఇలా జరగడం గమనార్హం..!

శుక్రవారం టీడీపీకి చెందిన మాజీ మిథున్‌ రెడ్డి తన సహచరులు అభిమానులు కార్యకర్తలతో అధిక సంఖ్య లో వైసీపీ లోకి చేరారు. మిథున్‌ రెడ్డి తో చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్‌ సురేష్‌, టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌ మాపక్షి మోహన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్‌, టీడీపీ కార్పొరేటర్లు నవీన ఇందు, శ్రీకాంత్, సహదేవన్‌, చంద్రయ్య, డేవిడ్‌, ముత్తయ్య, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు వేలంగాని, ఎంపీటీసీ రాధమ్మ, ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ లతా శ్రీధర్‌ తదితరులు పార్టీలో చేరారు. వీరితోపాటు మంగళగిరి చెందిన కొందరు నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవరం లోనే ఇలా జరగడం తో పార్టీ శ్రేణులు కలవర పడుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: