ముడాచారం పసికందు ప్రాణం తీసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మూడాచారం పసికందు ప్రాణం తీసింది ప్రాణం తీసింది. తన 3 ఏళ్ల కొడుక్కి దెయ్యం పట్టింది అనుకున్న ఓ కసాయి తండ్రి బాలుడికి వైద్యం చేయించాల్సింది పోయి వాతలు పెట్టాడు కర్ర తో చితకబాదాడు. దీంతో ఆ పసి కందుకి ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణం తీసింది. బాలుడి తాత పోలీసులకి ఫిర్యాదు చేయగా తల్లిదండ్రులపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

కోలూరుజిల్లా మాలూరుకు చెందిన రేణుక, హరీష్‌లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మారుతి కాలనీలో నివాసముంటున ఈ జంటకు.. మూడేళ్ల కొడుకు పృథ్వీ ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆ బాలుడు సరిగా ఉండకపోడం చూసి స్నేహితులని ఆశ్రయించాడు హరీష్.. బాలుడిని చూసిన స్నేహితులు బహుశా దెయ్యం పట్టుండొచ్చు అనడంతో హరీష్ ఆ బాలుడిని బెదిరించడం కర్రతో బాదడం మొదలు పెట్టాడు.

అంతటితో ఆగని ఆ కసాయి తండ్రి బాలుడిని సిగ్రేట్ తో కాల్చడం మొదలు పెట్టాడు. ఇంత జరుగుతున్నా ఆ తల్లి నోరు మేడపకపోటం గమనార్హం. సొంత కొడుకు అని కూడా చూడకుండా వైధ్యం చేయించాల్సింది మాని చురుకులు పెట్టడం మొదలుపెట్టారు. ఆ మూర్ఖుదిని ప్రోత్సాహించింది రేణుక. ఇలా వంటి నిండా వాతలు పెట్టడం తో బాలుడికి ఇన్ఫెక్షన్ సోకింది. ఇన్ఫెక్షన్ వల్ల బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా 3 వ రోజుకే బాలుడు మృతిచందాడు. ఇరుగు పొరుగు వల్ల సహాయం తో బాలుడి తాత హరీష్ రేణుకాలపై కేసు పెట్టాడు. దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: