అభినందన్ యువతకి స్పూర్తి- జనసేనాని

Google+ Pinterest LinkedIn Tumblr +

వింగ్ కమాండర్ అభినందన్ నిన్న రాత్రి భారత గడ్డ పై అడుగుపెట్టారు. అభినందన్ ని అభినందిస్తూ నేతలు ప్రముఖులు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందన్ రాకని ప్రస్తావిస్తూ అభినందనల వ్రాశామ్ కురిపించారు. అభినందన్ రాక వల్ల నిన్న ట్వీట్ల వర్షం కురిసింది. అభినందన్ రాక పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందన్ రాక పై ట్వీట్ చేశాడు.

భారత వాయుసేన యోధుడు అభినందన్ మన పుణ్యభూమికి తిరిగి చేరుకోవడం ఎంతో ఆనందాన్నికలిగించిందన్నారు. అతను సార్థక నామధేయుడు అంటూ కొనియాడారు. జాతి యావత్తు అభినందనలు అందజేసిన గొప్పదేశభక్తుడు అంటూ కొనియాడారు. శత్రువు చేతికి చిక్కినా మెుక్కవోని అతని ధైర్యం అందర్నీ అబ్బురపరచిందన్నారు.

అభినందన్ సాహసం, తెగువ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. జాతి యావత్తు అభినందన్ రాకకోసం ఎదురుచూస్తున్న తరుణంలో తన తరపున జనసైనికుల తరపున శుభాభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్.

Share.

Comments are closed.

%d bloggers like this: