టీడీపీ కి షాక్..! వదలని వలస..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజురోజుకూ దేగ్గర పడుతున్నాయి. రోజులు తగ్గుతున్నాయి కానీ వలసలు తగ్గట్లేదు.. తెలుగుదేశం పార్టీని విడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ వస్తున్నారు. నిన్న ఒకరు విడితే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా మరునాటికి ఇంకొకరు విడుతున్నారు. అసలేం జరుగుతుందో అర్ధం కానీ గందరగొలపు పరిస్థితులు టీడీపీ ని అలుముకున్నాయి. నిన్న చంద్రబాబు సొంత స్థానం చిత్తూరు నుంచి కొందరు పార్టీని వీడితే నేడు తిరుపతి నుండి కొందరు వీడబోతున్నారు.

టీడీపీ ని వీడటం ఇష్టం లేదంటూనే టీడీపీ ని వీడుతున్నారు తిరుపతి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ‘టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యా. ఇప్పుడు విధేయుల అభిమతం మేరకు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది’ అని ఆయన అన్నారు. తన అనుచరులతో భేటీ అయిన ఆయన.. అనంతరం పార్టీని వీడేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: