బాలయ్య బ్యానర్ కి కాస్త బ్రేక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరోగా మంచి హిట్లు అందుకున్నాడు బాలయ్య దాదాపుగా 100 కు పైగా సినిమాలు పూర్తి చేసుకొని మంచి హీరోగా తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నాడు బాలకృష్ణ. ఇదే రీతిలో మంచి నిర్మాతగాను నిలదొక్కుకుందాము అని భావించి నిర్మాతగా తన మోదటి సినిమా తన తండ్రి బయోపిక్ తో మొదలుపెట్టాడు. ఇదివరకు బాలయ్య ఎన్ని సార్లు సినిమా నిర్మించాలని అనుకున్నా బాలయ్య కి ఎప్పుడూ కుదరలేదు.

ఇక బయోపిక్ ల విషయానికొస్తే స్వయంగా ఏమి చెప్పకర్లేదు. అవి భారీ డిజాస్టర్లుగా టాక్ తెచ్చుకున్నాయి. ప్రిరిలీజ్ బిజినెస్స్ బాగా నడిచే సరికి బాలయ్యకి అంచనాలు ఉన్నప్పటికి రిలీజ్ తరువాత బయ్యర్లు బోరుమనడం చూసి బాలయ్య సినిమాల నిర్మాణం కి కొంత బ్రేక్ తీసుకుందామని నిశ్చయించుకున్నాడట.

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయాలనుకున్న సినిమాను మొదట బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై తీయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం నిర్మాతను వెతికే పనిలో పడ్డారు. నిర్మాతగా తొలి సినిమా దెబ్బ కొట్టడంతో బాలయ్య ఇప్పట్లో నిర్మాతగా సినిమాలు కంటిన్యూ చేయాలనుకోవడం లేదట. మరి బాలయ్య పూర్తిగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటారా లేదా..? అనే విషయంపై అధికార ప్రకటన రావల్సివుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: