సాహో చాప్టర్ 2 అదుర్స్..! హాలీవుడ్ రేంజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువీ క్రియెషన్స్ ధర్శకుడు సుజిత్ లు తెరకెక్కిస్తున్న సినిమా సాహో హాలివుడ్ రేంజ్ లో సిద్ధమవుతుంది. ఇలా చెప్పడానికి ఈరోజు విడుదలయిన సాహో చాప్టర్ 2 ఏ విజువల్సే నిధర్శనం. ఈ సినిమా లో భారీ ఆక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వీడియో మొదలయినప్పుడు నుంచి వీడియో చివర ప్రభాస్ బూమ్ అనెంతవరకు మనకి గన్నులే కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ కెన్నీ బటీస్ అద్భుత యాక్షన్ సన్నివేశాలు తోడు కావడంతో ‘సాహో’ హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. అయితే ఈరోజు సాహో సినిమా నటి శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు కావడం తో పుట్టిన రోజు కానుకగా ఈ వేడియో ని విడుదల చేశారు.

సాధారణంగా సినిమాల్లో ఎక్కువ శాతం హీరోలే గన్స్ పట్టుకుంటారు. కానీ నేడు విడుదలయిన సాహో చాప్టర్ 2లో బాలీవుడ్ భామ శ్రద్ధా కూడా గన్ తో అలరించింది. మామూలుగా హీరోయిన్లని అందానికే పరిమితం అన్నట్టుగా చూపించే సినిమాలకి సాహో ధీటుగా ఉంది. శ్రద్ధా గ్లామర్ కె పరిమితం కాకుండా యాక్షన్ సీన్స్ కూడా చేసిందట ఇందుకోసం ఆమె ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుందట. ఈ యాక్షన్ సన్నివేశాలకోసం ముందుగా అబుదబీలో 60 రోజులపాటు కష్టపడింది చిత్ర యూనిట్. యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల కోసం భారీ ట్రక్కలను 37 పైగా కార్లను ఉపయోగించారు. 60 రోజుల ప్రిపరేషన్ అనంతరం 30 రోజుల పాటు ఈ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. వీటిలో అధిక భాగం గ్రాఫిక్స్ లేకుండా రియలస్టిక్‌గా షూట్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా పెద్ద సాహసమే చేశారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్లతో రూపొందించారు. ఇక షూటింగ్ పనులు త్వరగానే పూర్థించేసుకోవలని చిత్రా యూనిట్ పరుగులు తీస్తుంది. వీలైనంత త్వర్గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాదనికి చిత్రా యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: