ఇమ్రాన్ కి ఓవైసీ హెచ్చరిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ దారుసలేంలో ఎంఐఎం 61వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అక్కడ ప్రసంగించిన అసదుద్దీన్ ఇమ్రాన్ ఖాన్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఇమ్రాన్ ఖాన్ తనను తాను టిప్పు సుల్తాన్‌గా అభివర్ణించుకోవడంపై మండి పడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరించిందని అందుకు ఆయన ఇమ్రాన్ ఖాన్ పై ఫయర్ అయ్యారు.

భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పుడూ సహించదని ఆయన అన్నారు. అసలు ఆ పద్దతికే మేము విరుద్ధమని ఆయన అన్నారు. పాక్‌ ప్రధాని తనను తాను టిప్పు సుల్తాన్‌గా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ విరుచుకుపడ్డారు. సుల్తాన్‌ ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా లేరన్న ఆయన రాజ్యానికి ఉన్న శత్రువుల మీద మాత్రమే టిప్పు సుల్తాన్ పోరాడారని చెప్పుకొచ్చారు. ఉగ్ర మూకలతో జతకట్టిన వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

మరోవైపు పాక్ ప్రధాని వారి వద్ద న్యూక్లియర్ వేపన్స్ ఉన్నాయంటూ చెప్పుకొస్తుంది మా దేగ్గర మికన్న ఎక్కువే ఉన్నాయని ఆయన ఇమ్రాన్ పై మండి పడ్డారు. వేపన్స్ ని భారత్ పాక్ కన్నా బాగా ఉపయోగించగలదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ ఆయుధాలని వాడటం మొదలు పెడితే మీ దేశం తట్టుకోలేదని ఆయన హెచ్చరించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: