ప్రశాంత్ డైరెక్షన్.. కేసీఆర్ ప్రొడక్షన్.. జగన్ షో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదలా శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ సి‌ఎం కేసీయార్ లా పై నిప్పులు చరిగారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కేసిఆర్ అండతో టిడిపి అనుకూల వ్యాపారుల పై జగన్ దాడులు చేస్తున్నారు. ఎంపి అభ్యర్థులుగా నిలబడే వ్యక్తులే వారికి టార్గెట్ హైదరాబాద్ నుండి జగన్ కెసిఆర్ కలిసి కుల్లు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే నేతలు ఇలా వాసలు కడుతున్నారు.

పేదల కోసం పెన్షన్ లు చంద్రబాబు ఇస్తే .. ఒక కులానికే ఇచ్చారని జగన్ దుర్మార్గం గా మాట్లాడుతున్నాడు.. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు చెక్ లు ఇస్తే చెల్లని చెక్ లు అంటారా.. వచ్చే ఎన్నికలలో చెల్లని పార్టీగా ఉండే వైసిపి నేతలకు అన్నీ చెల్లనవిగానే కనిపిస్తాయి..

ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు రెండు వేల‌ భృతి ఇచ్చాం.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ను కాపాడటమే కాక, రాయలసీమ కు నీరిచ్చిన ఘనత చంద్రబాబు ది.. పట్టిసీమ వల్ల జిడిపి 44వేల కోట్ల ఆదాయం పెరిగింది.. కేంద్రం నుంచి సాయం అందకపోయినా మన సిఎం పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు.. ఎపి బెస్ట్ స్టేట్ గా మూడో స్థానంలో ఉందంటే అది చంద్రబాబు పని తీరుకు నిదర్శనం..

నీకు, నీ తండ్రికి సాధ్యం‌ కాని పని మేము‌ చేసి చూపాము.. కడప జిల్లాకు, పులివెందుల కు చంద్రబాబు నీరిచ్చి చూపారు.. జగన్ కనీసం పోలవరం సందర్శించకుండా రాజకీయం చేస్తున్నాడు.. పోలవరం పనులు చూస్తే.. మాట్లాడటానికి ఏమి ఉండదని జగన్ కు భయం..

ఢిల్లీ‌వెళ్లి సిగ్గు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావా.. ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పు ఇస్తే అసెంబ్లీ ని ఎగ్గొట్టావు.. ప్రజల సమస్యలు పట్టవు కానీ, అసెంబ్లీ రాకుండా జీతాలు తీసుకున్నావు.. కనీస అవగాహన లేకుండా జగన్, వైసిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు..అంటూ ఆయన ఫైరయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: