మసూద్ అజహర్ మృతి పై రాజ్ దీప్ సంచలన ట్వీట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత సేపటిగా పుల్వామ ఉగ్రదాడి చేయించిన తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ మృతి చెండారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో అనేది మాత్రం తెలియని పరిసస్థితి. జాతీయ మీడియా కొన్ని చానల్స్ ఇప్పటికే మసూద్ అజహర్ చనిపోయినట్టుగా చూపెడుతున్నారు. ట్విట్టర్ వేదికగా చాలా మండి ఇదే విషయమై ప్రస్తావిస్తున్నారు. పాక్ మీడియా కూడా ఈ వార్తలని ప్రచారం చేస్తుంది. అయితే ఇది నిజమేనా అంటూ పలువురు మాత్రం ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

గత కొంత కాలంగా హిట్ లిస్ట్ లో ఉన్నాడు అజహర్ మసూద్. పుల్వామ దాడుల తరువాత భారత్ యొక్క ముఖ్య లక్ష్యం మసూద్ అజహర్. అయితే ఈయన కిడ్నీ సమస్య తో ఉన్న మాట నిజమే అయినప్పటికి కేవలం ఆయన పై ఉన్న టార్గెట్ ని మళ్లించడానికి పాక్ మెడియ ఈ వార్తలని ప్రచూరితం చేస్తున్నాయి అని కూడా వార్తలొస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా జరిగిన దాడులని దృష్టి మళ్లించే ఫ్రాయత్నం పాక్ చేయవచ్చు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన మాట్లాడుతూ.. మసూద్ అజహర్ కిడ్నీ సమస్య తో బాదపడుతున్న విషయం నిజమే అయినప్పటికీ పాక్ ప్రముఖ మీడియ వారు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం మసూద్ అజహర్ మృతి పై వచ్చిన వార్తలను తిప్పికొడుతున్నాయి.. మసూద్ అజహర్ కిడ్నీ సమస్యతో రోజు వారి డయాలసిస్ చేయించుకుంటున్నారని అతని మృతి పట్ల ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వార్తలన్నీ చూసినప్పటికి అసలు అజహర్ మసూద్ నిజంగానే మరణించార లేదా పాక్ మీడియా దృష్టి మళ్లించడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: