రేవంత్ ని విశ్వేశ్వర్ రెడ్డి లని మీరేంతకి కొన్నారు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై విమర్శలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ సంద్ర కాంగ్రెస్ పార్టీనీ వీడి తెరాస లోకి అడుపెట్టారు ఈ సంధర్భంగా ఉత్తమ్ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి రమ్మని ఎంత డబ్బు ఇచ్చారో కేసీఆర్ ని చెప్పమన్నారు.

ఈ సంధర్భంగా కేటీఆర్ ఈ విషయమై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ పై ద్వాజమెత్తారు.. ఆయన మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంత రావు బాహాటంగా కెసిఆర్ విధానాలు నచ్చి టీఆర్‌ఎస్ లో చేరుతామన్నారు. అవసరమైతే పదవులకు రాజీనామా కూడా చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని ఉత్తమ్ చేసిన విమర్శలు చేశారు వాటిని నేను ఖండిస్తున్నాను. ఉత్తమ్ నాయకత్వం పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లే విమర్శలు చేశారు. రాహుల్ ,ప్రియాంక ల సమక్షం లో నిన్ననే యూపీ బీజేపీ ఎంపీ సావిత్రి భాయి పూలే చేరారు.. ఆమెను రాహుల్ గాంధీ ఎంతకు కొన్నారు? పార్టీ లు మారడం ,విధానాలు సమీక్షించుకోవడం సహజమే.. ఇది కొత్త అన్నట్టు ఉత్తమ్ మాట్లాడుతున్నారు.

ఎన్నికల సమయం లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ లో చేరారు… వారిని ఎంతకు కొన్నారు రేవంత్ రెడ్డి ని ఎంతకు కొన్నారు ? గతం లో మా పార్టీ నుండి వెళ్ళిన ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారు ? అసలు కొనడం అనే మాటే తప్పు.. ఇది రాజకీయ వ్యవస్థ ను దిగజార్చాడమే. తమ మిత్ర పక్షం టీడీపీ ఏపీ లో 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నపుడు ఉత్తమ్ ఇలా ఎందుకు మాట్లాడ లేదు ? ఇలాంటి చవక బారు విమర్శలు మానాలి. అంటూ ఆయన పై ద్వాజమెత్తారు కేటీఆర్.

Share.

Comments are closed.

%d bloggers like this: