రాహుల్ పై ప్రధాని హాస్యాస్పద కామెంట్స్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రధాని మోదీ రాహుల్ గాంధీ పై పరోక్షంగా హాస్యాస్పద రీతిలో కామెంట్స్ చేశారు. డిస్లెక్సియా (ఒక రకమైన మానసిక సమస్య)తో బాధపడే చిన్నారుల అంశంపై మాట్లాడే సమయంలో రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు చేయడం వివాదానికి కారణమవుతోంది. రాహుల్ గాంధీ ని మోదీ 40-50 సంవత్సరాల బాలుడు అని పరోక్షంగా అన్నాడు. ఇక ప్రధాని చేసిన కామెంట్స్ పై నెటిజన్లు కాంగ్రెస్ లీడర్లు మాత్రం స్పందించక ఊరుకోవట్లేదు. ఒక్కొక్కరిగా ఆయన పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

విద్యార్థులతో శనివారం నిర్వహించిన ఓ వీడియో కాన్ఫెరెన్స్‌లో డిస్లెక్సియా సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు సంబంధించి తాము రూపొందించిన ఓ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వివరించబోయారు. మధ్యలోనే కల్పించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇది ‘40-50 సంవత్సరాల బాలుడికి’ కూడా ఉపయోగపడుతుందా? అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ వేసిన పరోక్ష సెటైర్‌ను కాస్త ఆలస్యంగా అర్ధం చేసుకున్న సభికులు కూడా బిగ్గరగా నవ్వేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: