నీకు నేనున్నా.. యాడ్స్ చేయి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బోయపాటి శ్రీను ఈ పేరు వినగానే ఎవ్వరికైనా గుర్తొచ్చేది పవర్ఫుల్ ఫైట్స్ ఫ్యామిలీ ఎమోషన్స్.. అయితే ఈ దర్శకుడికి చివరిగా హిట్ ఇచ్చిన చిత్రం అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు. సరైనోడు తరువాత ఈయన రెండు సినిమాలు చేశాడు ఆ రెండిటికీ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లే.. సినిమాకి లాభాలు పక్కన పెడితే సాదారణ వసూళ్లు కూడా రాకపోవడం ఈయన పై క్రేజ్ ని నమ్మకాన్ని తగ్గించాయి. ఇక రామ్ చరణ్ తో ఈయన చేసిన సినిమా వినయ విదేయ రామ్ కి రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలో ఏ హీరో కూడా ఈ డైరెక్టర్ ని ఇప్పుడు నమ్మని పరిస్తితి.

బాలకృష్ణ కి దాదాపుగా మూడు హిట్లు ఇచ్చిన శ్రీను ఇప్పుడు బాలయ్య తో మరో చిత్రం చేయనున్నాడు. ఇక ఈ సినిమా కి ముందు బాలయ్య నిర్మిస్తానని ప్రకటించాడు. కానీ బాలయ్య కి రెండు వరుస ఫ్లాప్స్ వచ్చేసరికి ఇక ఆయన కూడా ప్రొడక్షన్ కి చేతులు ఎట్టేసినట్టే.. ఇక ఏ ప్రొడ్యూసర్ కూడా బోయపాటి అంటే ముందుకు రాటానికి బయపడుతున్నారు.

ఇలాంటి పరిస్తితి లో ఏపీ సీఎం చంద్రబాబు నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తెలుగు దేశం యాడ్స్ ని ఈయనే తెరకెక్కించాలంటు బాబు శ్రీనునీ కోరారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా టీడీపీకి ఈయ‌నే కొన్ని యాడ్స్ చేసి ఇచ్చాడు.. ఆ త‌ర్వాత పుష్క‌రాల యాడ్స్ కూడా బోయ‌పాటి చిత్రీక‌రించాడు. అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు మ‌రోసారి బోయ‌పాటి శ్రీనును త‌మ పార్టీ ప్ర‌చార చిత్రాలు తెర‌కెక్కించాల్సిందిగా ఈయ‌న కోరుతున్నాడు. ప్‌ోస్తుతం ఇదే ప‌నిపై బిజీగా ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

Share.

Comments are closed.

%d bloggers like this: