కసాయి తల్లి.. కొడుకు మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. కన్నబిడ్డలపాలిట కడుపార మోసిన తల్లే కసాయిలా మారింది. 9 నెలలు మోసి తన రక్త మాంసాలు ఇచ్చిన తల్లే తన పిల్లలని చంపుకుంది. ఇటుక రాయితో బాదింది ఒకరిని పొట్టన బెట్టుకుంది మరొకరి పరిస్తితి విషమం. ఇద్దరు కొడుకులపై దాడి చేయగా.. అందులో ఒకరు అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన శ్రీకాంత్, రమాదేవి దంపతులకు అజయ్, ఆర్యలు సంతానం. శ్రీకాంత్ ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులు ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన రమాదేవికి కొద్దిరోజులుగా మానసిక స్థితి సరిగా లేదట. తరచూ భర్త, ఇద్దరు పిల్లతో గొడవపడుతుండేదట. స్కూల్‌లో కూడా పిల్లలతో దురుసుగా ప్రవర్తించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

సోమవారం ఉదయం భర్త శివరాత్రి పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి రమాదేవి ఇద్దరు పిల్లలపై ఇటుకరాయితో దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద కుమారుడు అజయ్ అక్కడికక్కడే చనిపోగా.. చిన్నకుమారుడు అజయ్ రక్తపు మడుగులో పడి పెద్దగా కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కలవారు రాగా.. శ్రీకాంత కూడా బయట నుంచి తిరిగొచ్చాడు. రెండు కుమారుడు ఆర్యను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: