ఇప్పుడైతే మోదీ చీరలు ఇక పై మరెన్నో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామా దాడుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి మరింత క్రేజ్ పెరుగింది. గత ఎన్నికలకీ ముందు మోదీ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో క్రేజ్ ని సంపాదించుకున్నారు మోదీ. అయితే ఈ క్రేజ్ ని కొంత మంది క్యాష్ ఇన్ చేసుకుంటున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పెరిగిన మోదీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని డిఫరెంట్ గా ఆలోచించి హైదరాబాద్‌లోని ఓ వస్త్రదుకాణం మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన చీరలు అమ్ముతోంది. ఇక మోదీ చీరలు అంటూ వీటికో ఓ పేరే కాక అదే రీతిలో మార్కెట్ కూడా వస్తుంది.

నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, పెట్రో ధరల పెరుగుదల వంటి కారణాలతో నరేంద్ర మోదీ మేనియా కనుమరుగైంది. ఇప్పుడు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడి, నెక్ట్స్ పీవోకేలోని బాలాకోట్‌లో ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మళ్లీ మోదీ జపం మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయనకు ఆదరణ కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి పెద్దగా ఆదరణ లేని తెలంగాణలో సైతం… సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మోదీ మేనియా కనిపిస్తోందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ చీరాలలో మోదీ ఫొటోతో, సర్జికల్ స్ట్రైక్స్ టైటిల్ అంచుతో తయారుచేసారు ఈ చీరలకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. క్వాలిటీని బట్టి వివిధ ధరల్లో లభిస్తున్న ఈ చీరలకు ఎన్నికల వేళ ఎంతో క్రేజ్ ఉండబోతునదని వారు ఆశిస్తున్నారు. ఇక వ్యాపారులు సైతం మోదీ చిత్రాలతో బిజినెస్ చేస్తున్నారంటే ఒక దిశలో మోదీ దిశ మారినట్టే అనిపిస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: