….యుద్ధ వీరుడి వీరగాధ!

Google+ Pinterest LinkedIn Tumblr +

అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వినగానే భారత దేశపు హీరోనా అని అంటున్నాయి ప్రపంచ దేశాలన్నీ. ఇప్పుడు అభినందన్ భారత దేశపు సూపర్ హీరో.. ఎందుకంటే భారత్ శత్రు దేశం పాకిస్తాన్ సైన్యానికి చిక్కి అక్కడ 3 రోజుల పాటు వారి చెరలో గడిపి మన దేశపు గుట్టు.. రక్షణ రహస్యాలను కాపాడిన దీరుడు ఈయన. ఎటువంటి వారైనప్పటికీ శేత్రు దేశానికి బందీగా వెళితే వారి దైర్యాన్ని కోల్పోతారు. కానీ అభినందన్ వారి విమానాలని చెస్ చేసి వారి భూబాగం లోకి వెళ్ళి వారి విమానాలపై మిసైల్స్ విసిరి.. ఏకంగా వారి దేశం లో మూడు రోజులు బందీ అయ్యి తిరిగివచ్చారు.

చెరలో ఉన్నప్పటికీ ఎటువంటి రహస్యాలని వారికి చెప్పకుండా వారు ఏం అడిగినా సారి మేజర్ నేను చెప్పాను అని అన్న ఆయనకి ఇప్పుడు దేశ ప్రజలంతా ఫిడా అవుతున్నారు. దేశంలో ఇప్పుడెక్కడ చూసినా అభినందన్ గురించి చర్చించుకోవడం ఓ ప్రాధాన్య అంశంగా మారిపోయింది. ఇక ఈయన జీవితం పై ఒక సినిమాని కూడా తెరకెక్కించబోతున్నారని సమాచారం.

బాలీవుడ్ లో దిగ్గజ ఫిలింమేకర్ గా పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ టి-సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అభినందన్ బయోపిక్ కు అభిషేక్ కపూర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సినిమాకి హీరోగా ఎవరు చేయబోతున్నారు అనే విషయమే సస్పెన్స్ గా మారింది. కొన్ని ఊహాగానాల ప్రకారం జాన్ అబ్రహాం అభినందన్ పాత్ర పోషించబోతున్నారని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: