అప్పట్లో హార్దిక్.. ఇప్పుడు విజయ్ శంకర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

త్వరలో ప్రపంచ కప్ ఆటలు ప్రారంభం కానున్నాయి ఈ తరహాలో భారత్ కి మంచి సూచనలు ఎదురవుతున్నాయి బ్యాటింగ్ లో విఫలమయినప్పటికి టీం ఇండియా బౌలింగ్ విభాగం లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. నిన్న జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ క్రికెట్ అభిమానులని ఉత్కంట లోకి దింపింది. చివరి ఓవర్ వరకు మ్యాక్ సాగింది..251 పరుగులు భారత్ ఆస్ట్రేలియా కి టార్గెట్ గా ఇవ్వగా చివరి ఓవర్ లో కేవలం 11 రన్లు మాత్రమే మిగిలాయి.. ఆస్ట్రేలియా అనుభవ అల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గ్రీస్ లో ఉన్నాడు అప్పటికే 52 రన్లు కూడా చేశాడు.

ఇక భారత అభిమానులు బయానికి గురవుతున్నారు. మ్యాచ్ చేజారిందా అనే అనుమానాలతో ఉన్నారు. ఇక చివరి ఓవర్ భారత నూతన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వేయాల్సి ఉంది. మునుపు బౌలింగ్ అవకాశం దక్కగా విజయ శంకర్ 13 రన్లు ఇచ్చాడు ఇక స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. కానీ చివరి ఓవర్ లో భారత నూతన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ అద్బుతమైన బౌలింగ్ చేశాడు. చివరి ఓవరలో 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టిమ్ ని కుప్పకూల్చాడు.. భారత విజయానికి కారణం అయ్యాడు. అటు బ్యాటింగ్ లోను వియజయ్ శంకర్ చక్కటి ప్రతిభ చూపాడు.. 46 రన్లు చేసి టీం స్కోర్ ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాడు. ఈ తరహాలో భారత్ కి మరో మంచి అల్ రౌండర్ దొరికినట్టే అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

మ్యాచ్ లో భాగంగా భారత జట్టు స్కోర్ ఆమాత్రం అవ్వడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ 120 బంతుల్లో 116 రన్లు చేసి స్కోర్ ని ఆమాత్రం చేయాయడానికి తోడ్పడ్డాడు. రోహిత్ శర్మా. ధోనిలు.. సున్నా కె అవుట్ అవ్వగా ధావన్ 21 ఇలా విరాట్ విజయ్ తప్ప ఏ ఒక్కరూ కూడా 20 కి మించి రన్లు చేయకపోడం తక్కువ స్కోర్ కి దారి తీసింది. బౌలింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ 3 వికెట్లు విజయ్ 2 బూమ్రా 2 వికెట్లు తీశారు.. ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్ 52 పరుగులు పాత్ కమిన్స్ 4 వికెట్లు తీశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: