జగన్ సొంతింటి మీద ప్రేమ లేని దొంగ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుధవారం ఉదయం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా కాల్వ వైసీపీ పార్టీ పై వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఎటువంటి ప్రేమ లేదని కేసీఆర్ మోదీ లతో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. ఇటువంటి రాజకీయం మరెక్కాడా ఉండదని ఆయన అన్నారు. చిల్లర దొంగలకు కూడా తమ ఊరు, తమ ప్రాంతం, తమ కుటుంబం మీదే ప్రేమ ఉంటుంది…అయితే జగన్ కు మాత్రం రాష్ట్రం పై ఎలాంటి ప్రేమ లేదు అన్నారు. నరేంద్ర మోదీ కేసీఆర్ లతో జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని అడ్డు కుంటున్నారు. జగన్ ద్వారా ఏపీలో బలహీనమైన నాయకత్వం రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

బీజేపీ దక్షణాది నాయకత్వం బలహీన పరిచేలా ఎత్తులు వేస్తోంది. హైద్రాబాద్ లో ఉన్న లోకేశ్వర రెడ్డి ఏపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు…దానిపై తెలంగాణ పోలీస్ లు విచారణ చేస్తున్నారంటున్నారు అసలు ఇదెక్కడ చోద్యం ఏపీ వ్యవహారాలపై తెలంగాణ లో ఫిర్యాదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ లో ఏపీ భాగం ఎలా అవుతుందో వారే చెప్పాలి అని ఆయన అన్నారు…
తెలంగాణ లో ప్రతిపక్ష ఓట్లను తొలగించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకున్నారు తెలంగాణ పోలీసులు, వారి ప్రభుత్వం సహకారంతో మా పార్టీ డేటాను కూడా దొంగిలించారు అన్నారాయన. తెలంగాణ పోలీస్ లు మా పార్టీ డేటా ను దొంగిలించారు. ఫారం7 ను మేమే తొలగిస్తున్నాం అని జగన్ అంగీకరించారు…మేమే దొంగతనం చేస్తున్నాం అని జగన్ ఒప్పుకున్నారు. దీంతో జగన్ ఓట్ల దొంగ అని అందరికి తెలిసిపోయింది, ఇక ప్రజలే జగన్ కి తగిన బుద్ధి చెబుతారు అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: