మే 9 న మన ముందుకి ‘మహర్షి’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ అనే నేను సినిమాతో భారీ హిట్ అందుకున్న మహేశ్ బాబు రాబోయే సినిమాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారట. తన మనసుకి నచ్చిన కథ అయితేనే ఒప్పుకుంటున్నారట. ముఖ్యంగా కథలో సామాజిక నేపద్యం ఉంటేనే కథ ని ఓకే చేస్తున్నారట. అయితే ఇదే నేపద్యంలో సుపర్ స్టార్ మహర్షి సినిమాని ఒప్పుకున్నారట. ఇక సుపర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే మహేశ్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ముందు రోజు బుక్ చేస్కుంతే తప్ప టికెట్ కూడా దొరకదు.

ఇక అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మహర్షి రీలీజ్ కై రోజుకొక వార్తా వింటున్నారు. సినిమా ఇప్పుడు.. అప్పుడూ.. అంటూ వస్తున్నారు సినిమా యాజమాన్యం.. ఈ విషయమై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన చిత్రబృందం దాన్ని కాస్త ఏప్రిల్ 25కి మార్చింది.

ఏప్రిల్ 25 న సినిమా రావడం పక్కా అంటూ రెండు సార్లు అనౌన్స్ కూడా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ డేట్ మారింది. నిన్నటి నుండి ఈ సినిమా మేలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాను మే 9న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సంధర్భంగా వచ్చిన డౌట్స్ ని క్లియర్ చేశారు సినిమా నిర్మాత దిల్ రాజు. ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు ఈ సినిమా పై కొన్ని అంశాలని వెల్లడించాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బరువెక్కిన హృదయంతో బయటకి వస్తారంటూ, సినిమాలో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాడు దిల్ రాజు.

Share.

Comments are closed.

%d bloggers like this: