లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ లో వర్మ కోడలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో ఎవరు గ్రహించలేము. ఎప్పుడు ఏ సెంసేషన్ సృష్టిస్తాడో తెలియదు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఏం ట్వీట్ చేసిన అది సంచలనమే..! అయితే ఆయనకు ఎమోషన్స్ ఉండవని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతుంటారు. కానీ ఆయనకు ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని వర్మ తల్లి కూడా చెబుతుంటారు. ఇకపోతే రీసెంట్ గా వర్మ తన మేన కోడలితో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.

అస‌లు త‌న కుటుంబం గురించి ఎప్పుడూ బ‌య‌టికి చెప్ప‌ని వ‌ర్మ‌.. ఇప్పుడు ఉన్న‌ట్లుండి త‌న మేన‌కోడ‌లిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వ‌ర్మ మేన కోడ‌లు శ్యావ్య వ‌ర్మ కూడా క‌నిపించ‌బోతుంది. అయితే ఆమె న‌టిగా కాకుండా తెర‌వెన‌క పాత్ర పోషిస్తుంది. వ‌ర్మ మేన‌కోడ‌లు అంటే న‌టిగా వ‌స్తుంద‌నే ఆలోచ‌న కూడా ఎవ‌రూ చేయ‌రు. క‌చ్చితంగా ఆమె ఆఫ్ స్క్రీన్ లోనే స‌త్తా చూపిస్తుంద‌ని అంద‌రికీ తెలుసు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా క్యాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో శ్రావ్య ప‌ని చేసింది.

ఇప్పుడు ఆమెను ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం చేసాడు వ‌ర్మ‌. త‌న ట్విట్ట‌ర్లో మేన‌కోడ‌లు శ్రావ్య‌తో దిగిన ఫోటోలు షేర్ చేసాడు ఆర్జీవీ. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో క్యాస్ట్యూమ్ డిపార్ట్ మెంట్ కు మంచి అప్లాజ్ వ‌చ్చింది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌ల్లో కూడా ఎన్టీఆర్ తో పాటు మిగిలిన వాళ్లు కూడా అద్భుతంగా ఉన్నారు. ఈ క్రెడిట్ మొత్తం శ్రావ్య‌కు వ‌స్తుందేమో మ‌రి.

Share.

Comments are closed.

%d bloggers like this: