బాలీవుడ్ లో నాగ్ బ్రహ్మాస్త్రం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కథ చాలా పెద్దదిగా ఉండటంతో ఈ సినిమా ని 3 భాగాలుగా తీస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో హాలీవుడ్‌ స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ తో పాటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇంట్రస్టింగ్ ఏంటంటే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు.. అక్కినేని అందగాడు నాగార్జున నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ లో నాగ్ కనిపించనున్నారు. మన రాష్ట్రాల్లో కూడా మంచి హిట్ దక్కించుకోడానికి నాగ్ కి ఈ పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమా స్టోరీ లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటం తో అనేక బాషల్లో సినిమాని రూపొందించడానికి చిత్రా ఉయింట్ సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాని నిర్మించగా అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి కథ ని అందించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇక సంగీతం ప్రీతం అందిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ని ఫిబ్రవరి నెల 24 న ప్రారంభించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: