చెరిత్ర ఎరుగని చోరీ.. జగన్ గవర్నర్ కి జారీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో డేటా వివాదం కలకలం రేపుతుంది. డేటా చోరీ చేసారంటూ ఇదివరకే య్క్ప నేతలు తెలంగాణ పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు పూర్తి వివారాలు సేకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై‌సీపీ అధినేత జగన్ ఈ మేరకు గవర్నర్ నర్సింహన్ ని కాలిసి కొంత సేపు చర్చ చేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష‌ నేత జగన్, పార్టీ సీనియర్ నేతలు ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సైబర్ నేరాలు జరగలేదేమోనన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థపై జరిగిన దాడుల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయని జగన్ పేర్కొన్నారు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్ తయారు చేసిందన్న జగన్.. ప్రజల ఆధార్ వివరాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఎలా వచ్చాయి? ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఈ వివరాలు ఎలా వచ్చాయి? ఎవరికీ అందుబాటులో ఉండని మాస్టర్ కాపీ ఐటీ గ్రిడ్స్‌కు ఎలా వచ్చింది.. అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం డేటా సేవా మిత్ర యాప్‌లోకి ఎలా వచ్చింది.

బ్యాంకు ఖాతా వివరాలు సేవామిత్ర యాప్‌లో కనిపిస్తున్నాయి. వారి వద్ద ప్రజల వివరాలు ఉంటే రేపు మోసాలు జరగవా? టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ డేటా పంపించారు. ఓటరు ఎవరు, ఏ పార్టీ అభిమాని అని టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. సర్వే పేరుతో గ్రామాలకు వెళ్లారు.. పద్ధతి ప్రకారం ఓట్లు తొలగించారు. రెండేళ్లుగా పథకం ప్రకారం ఈ పని చేస్తున్నారు. ఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితాను మేం పరిశీలించాం.

2014లో మేం ఓడిపోయింది కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో. నకిలీ ఓట్లు ఉన్నాయని గ్రహించి లెక్కలు తీశాం. వివిధ విభాగాల్లో 56 లక్షల ఓట్లు ఉన్నాయని కేసు పెట్టాం. మా ఫిర్యాదుపై దర్యాప్తు చేయకుండా మరిన్ని ఓట్లు చేర్చారు. దొంగ ఓట్లు ఉన్నాయని తేలితే వాటిని తీసేయాలని ఈసీని కోరాం. రెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయని ఫిర్యాదు చేశాం. ఫారం-7 కింద దరఖాస్తు చేసిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల అధికారులు విచారణ చేసి కొత్త ఓటర్లను చేరుస్తారు. ఓటు నమోదు, తొలగింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మాస్టర్ కాపీ తీసుకోవడం సైబర్ నేరం. ఫోటోతో సహా వివరాలు చోరీ చేసి ఇవ్వడం నేరం. ఇలాంటి పనులు చేసిన వారిపై కేసులు పెట్టేలా చూడాలని గవర్నర్‌ను కోరాం.

Share.

Comments are closed.

%d bloggers like this: