కొడుకుల పాలిట యముడైన తండ్రి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోరు ముద్దలు తినిపించాల్సిన తండ్రి పిల్లలని గొంతు కోసి చంపాడు. నిత్య మద్యం.. ఆపై మత్తులో గొడవలు.. అటు భార్య పై ఇటు పిల్లలపై చేయి చేసుకోడం ఆ తండ్రి వైఖరి. ఈ వైఖరి తనకి అలవాటై భార్య తో రోజూ గొడవ పడేవాడు. సంపాదన తక్కువ తాగడం ఎక్కువ అయ్యేసరికి ఇరువురి మద్య గొడవలు. ఈ గొడవలే చివరికి తనని ఓ హంతకుడికిని చేశాయి. తన పిల్లల గోతు కోసి తాను ఉరేసుకున్నాడు.

వివరాల్లోకి వెలితే.. గుంటూరు జిల్లా చిలకలూరి పేట పట్టణంలో రమణ లక్ష్మి భార్యభర్తలు ఉండేవాళ్లు.. వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరూ కొడుకులే.. రమణ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోమంగళవారం రాత్రి కూడా భార్యతొ ఘర్షణకు దిగాడు.. ఘర్షణ పెద్దదై భార్య రమణ పై విసిగిపోయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయిన అతనై వైఖరి మారలేదు.. రోజూ లాగే నిన్నరాత్రి కూడా ఫుల్‌గా తాగొచ్చిన రమణ తన ఇద్దరు కుమారుల గొంతుకోసి వారిని హతమార్చాడు. అనంతరం తాను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కవారి సమాచారం అందుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేరి విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: