కత్తితో పొడిచి చంపాడు ఓ బౌన్సర్ భర్త..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అనుమానం పెనుభూతం అయ్యి భార్య భర్తలని విడదీసింది అని విన్నాం.. కానీ ఇక్కడ ఆ అనుమానం పెనుభూతం అయ్యి భార్య ప్రాణం తీసింది.. భర్తని హంతకుడిని చేసింది.. ఫోన్ లో చాటింగ్ చేసిందని భార్యని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. చాటింగ్ చేస్తూ తన కంటపడ్డ భార్యని ఉపేక్షించలేదు కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త.. భార్యని చంపిన అనంతరం పరారయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాయణ గుట్టకి చెందిన బౌన్సర్ కి గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. కాగా.. పెళ్లి జరిగిన కొద్దిరోజులు బాగానే ఉన్నారు. ఆ తరువాత భార్య ఒకటి రెండు సార్లు చాటింగ్ చేస్తూ ఆ భర్త కంట పడింది. ఇక అప్పుడు మొదలయ్యింది ఈ అనుమానం.. అనుమానాన్ని పెంచుకున్నాడు అది కాస్త పెంభూతంగా మారింది. భార్య తన స్నేహితులకు ఫోన్ లో మెసేజ్ చేయడం నచ్చని.. బౌన్సర్ తరచూ ఆమెను హింసించేవాడు.

ఇలా హింసించినప్పటికీ ఆమె వైఖరి మారకపోవడంతో.. బుధవారం దంపతులు ఇద్దరి మధ్యా వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బౌన్సర్.. కత్తితో భార్యను పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: