ఒకే రోజు 14 ఐటీ సంస్థల ఒప్పెందాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ పారిశ్రామిక రంగంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పారిశ్రామిక రంగంలో రూ.21,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒకేరోజు 14 ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీఈడీబీ సంస్థ సీఈవోతో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు చేసుకున్న ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 57,000 మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

ఆ ఒప్పందాలలో కొన్ని ముఖ్యమైనవి….

1. కర్నూలు జిల్లాలో 200 ఎకరాల్లో రూ.1,227.01 కోట్ల పెట్టుబడితో ఉక్కు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మారుతీ ఇస్పాత్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది.
2.ప్రకాశం జిల్లాలో 1,100 ఎకరాల్లో ‘తెలుగు ఔషధాలు-రసాయనాల సంఘం’ ఆధ్వర్యంలో రూ.9 వేల కోట్లతో ఎంఎస్ఎంఈ ఔషధ పరిశ్రమలు ఏర్పాటు.
3.హెచ్పీ ఇండియా ఆధ్వర్యంలో త్రీడీ ముద్రణ సాంకేతిక కేంద్రం
4.చిత్తూరు శ్రీసిటీలో రూ.700 కోట్లతో ZTT ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తయారీ ప్లాంట్
5.చిత్తూరు శ్రీసిటీలో ఓజోవతి ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,600 కోట్లతో లిథియం బ్యాటరీల పరిశ్రమ.
6.చిత్తూరు శ్రీసిటీలో అవాంజీ ఇన్వెంటివ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,800 కోట్లతో లిథియం బ్యాటరీల పరిశ్రమ.
7.పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.710 కోట్ల పెట్టుబడితో గోదావరి విశ్వవిద్యాలయం ఏర్పాటు. కంప్యూటర్, బిజినెస్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులను ప్రవేశపెట్టే ఈ యూనివర్శిటీలో 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
8.రూ.4,800 కోట్ల పెట్టుబడితో 20 చోట్ల ఎల్ఎన్జీ టెర్మినల్, ఎల్సీఎన్జీ స్టేషన్లు.
9.సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు. రూ.35 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి.
10.‘శ్రేయాంత్ర ఇండస్ట్రియల్ హేంప్ ఆంధ్ర ప్రయివేట్ లిమిటెడ్’ రూ.1,000 కోట్ల పెట్టుబడితో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
11.డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.205 కోట్ల పెట్టుబడితో వినోద పార్కు, అయిదు నక్షత్రాల గోల్ఫ్ రిసార్ట్.

Share.

Comments are closed.

%d bloggers like this: