తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ఎందుకు క్లోజ్ అయ్యింది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా రాష్ట్రం లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. డేటా చోరీ అయ్యిందంటూ వైసీపీ నేత ఒకరు కేస్ పెట్టారు ఇక అప్పుడు మొదలయిన ఈ వ్యవహారం రోజురోజుకీ రాచ్చాలా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పక్షాలే కాకుండా తెలంగాణ లోని పార్టీలు కూడా ఈ వివాదం పై విచారణలు చేస్తుండటం గమనార్హం. టీడీపీ పార్టీ యాప్ సేవా మిత్రా ద్వారా డేటా ని దొంగలించారు అంటూ వైసీపీ వాళ్ళు అంటుంటే ఫారం 7 అడ్డుపెట్టుకొని ఓట్లు తొలగించారు అంటున్నారు టీడీపీ వాళ్ళు అసలు ఏది నమ్మాలో ఏది నమ్మోద్దో ప్రజలకి అర్ధం అవ్వక తికమక పడుతున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ అయిందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోటా విన్నా.. ఏ న్యూస్ చానల్ చూసినా ఇదే ప్రస్తావన..! దీని గురించే చర్చలు. ఇలాంటి సమయంలో.. టీడీపీ అధికారిక వెబ్ సైట్ http://www.telugudesam.org క్లోజ్ అవ్వడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.ఎంత ప్రయత్నించిన ఓపెన్ అవ్వట్లేదు. అయితే.. ఈ వెబ్ సైట్ ని ఇప్పుడు టీడీపీ నేతలు కావాలనే క్లోజ్ చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం బయటపడకుండా ఉండేందుకే వెబ్ సైట్ కార్యకాలాపాలు నిలిపివేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: